శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే అరెస్టయ్యారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2023లో రణీల్ విక్రమసింఘే లండన్ పర్యటన గురించి పోలీసులు తొలుత విచారణ చేశారు. అనంతరం ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని వెల్లడించారు.