అన్నమయ్య: పద్మ విభూషణ్, నటుడు చిరంజీవి జన్మదిన వేడుకలు శుక్రవారం చిరంజీవి ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మదనపల్లెలోని వెలుగు సంస్థ నందు వృద్ధులు, దివ్యాంగులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎం.ఉదయ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.