CTR: సంక్షేమ పథకాల అమలులో సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గ్రామ గ్రామాన తెలియజేయాలని వెంకటే గౌడ సూచించారు. ఈ మేరకు శుక్రవారం పలమనేరు వైసీపీ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. అనంతరం మామిడి రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.