NLR: P4 కార్యక్రమంలో భాగంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వార్లు దత్తత తీసుకున్న బుచ్చిరెడ్డి పాళెం పట్టణం 20వ వార్డు పరిధిలోని రామచంద్రాపురం ఎస్సీ కాలనీని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సందర్శించారు. శుక్రవారం స్థానిక సమస్యల గురించి అధికారులు, నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.