KMR: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రేపు ఎల్లారెడ్డి పట్టణానికి రానున్నట్లు ఎమ్మార్పీఎస్ నాగిరెడ్డిపేట మండల గౌరవ అధ్యక్షుడు కుంటోల్ల యాదయ్య మాదిగ శుక్రవారం తెలిపారు. బోధన్, బీర్కూర్, ఎల్లారెడ్డి మండలాల్లో దివ్యాంగుల చేయూత పెన్షన్ధార్ల పెన్షన్ల పెంపు కోసం సన్నాహక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు.