VSP: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులకు సూచించారు. ఆగస్టు నెలలో ‘వర్షాకాలం పరిశుభ్రత’కు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.