ప్రకాశం: కనిగిరి పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్ కమీషనర్ పి.కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునిసిపల్ కార్యాలయంలో శానిటరీ సెక్రెటరీలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమీషనర్ మాట్లాడుతూ పట్టణంలో నూరుశాతం ఇంటింటి చెత్తను సేకరించి తడిచెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తను వేరు చేయాలన్నారు.