ATP: అనంతపురం సోములదొడ్డి రోడ్‌లోని అక్షర జూనియర్ కళాశాలలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదంతో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈగల్ సెల్ ఇన్‌ఛార్జి హనుమంతు డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్ప్రభావాలు, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం శిక్షలను వివరించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శమవుతామని ప్రతిజ్ఞ చేశారు.