GNTR: ఏటి అగ్రహారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై తరంగిణి పాల్గొన్నారు. విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, టెక్నాలజీని బాధ్యతాయుతంగా వినియోగించడం, సైబర్ క్రైమ్ నివారణ, వ్యక్తిగత భద్రతపై సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల ప్రవర్తనను భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.