NDL: శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని జ్యోతిలింగ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమానికి వేలాది మహిళలు హాజరయ్యారు. అనంతరం ఆలయ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం చేయించారు.