KMM: ఫేక్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఓ దిన పత్రికకు అర్ధం వచ్చేలా డేట్ లైన్ మార్ఫింగ్ చేసి తప్పుడు వార్త కథనాన్ని ప్రముఖ దిన పత్రికలో వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుపై ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని వెల్లడించారు.