SRPT: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కార్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మునగాల మండలం బరాకత్ గూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న కార్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.