SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలస వద్ద ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రాన్ని విశాఖ రీజియన్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అకస్మికంగా పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. తప్పనిసరిగా ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శిక్షణ పొందుతున్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.