BPT: అద్దంకిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 26వ తేదీన పంచాయతీ కార్యదర్శులు, ASOలు సర్పంచులకు పంచాయతీ అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఎండీవో సింగయ్య శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. శిక్షణలో పంచాయతీ అభివృద్ధి, తీసుకోవలసిన చర్యలను గురించి వివరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరారు.