MNCL: కాసిపేట మండలంలోని దేవాపూర్ అటవీ రేంజ్ పరిధిలోని రొంపల్లి సెక్షన్లో శుక్రవారం పెద్దపులి దాడిలో మూడు పశువులు మృతి చెందాయి. ముగ్గురు రైతులకు చెందిన ఆవు, ఎద్దు, దూడ మేతకు వెళ్తుండగా పులి వాటిని హతమార్చింది. పశువుల కళేబరాల వద్ద పెద్దపులి పాదముద్రలను గుర్తించి అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించారు. బాధితులకు పరిహారం అందజేస్తామని రేంజ్ అధికారి అనిత తెలిపారు.