BPT: బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ దూడి, ఆదేశాల మేరకు జె.పంగులూరు ఎస్సై ఆధ్వర్యంలో ఎన్‌హెచ్-16 హైవే అధికారులతో కలిసి ఆలవాలపాడు క్రాస్‌రోడ్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా అవసరం అని ప్రజలకు వివరించారు.