CTR: కోర్టుకు పూతలపట్టు ఎమ్మెల్యే డా.మురళీమోహన్ శుక్రవారం హాజరయ్యారు. ఈ మేరకు వైసీపీ హయాంలో తవణంపల్లి మండలంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి అప్పట్లో ఆయనపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. అక్రమ కేసులో 63 రోజులపాటు ప్రజలకు దూరంగా అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిందని, ప్రజా తీర్పు ముందు వైసీపీ కుట్రలు మట్టి కరిచాయని ఆయన పేర్కొన్నారు.