MBNR: మూసాపేట మండలం జాతీయ రహదారి-44 నుంచి తాళ్లగడ్డ గ్రామానికి వెళ్లే రహదారిపై రూ.1.25 కోట్ల నిధులతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు, రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.