SKLM: జలుమూరు మండలం చల్లవానిపేట గ్రామానికి చెందిన పంచ రెడ్డి రామచందర్రావు పంట పొలంలో శుక్రవారం ప్రయోగాత్మకంగా డ్రోన్ సహాయంతో నానో యూరియా పిచికారి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట సహాయ సంచాలకులు ఎల్బీ మధు వ్యవసాయ అధికారి కింజరాపు రవి, పి వెంకట్రావు, పి రామారావు, బుక్క కామేశ్వరరావు రైతులు పాల్గొన్నారు.