కృష్ణా: పోరంకిలో పోలీసులు గురువారం గంజాయి పట్టుకున్నారు. ఎస్సై ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం.. బి.జె.ఆర్. నగర్లో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శ్రీ సూర్య, రోహిత్, ప్రవీణ్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.