KMM: విద్యుత్ పరికరాలను రైతులు సొంతంగా రిపేర్ చేయవద్దని ఏఈ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ముదిగొండ మండలం కట్టకూరులో విద్యుత్ శాఖ – పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఏఈ అవగాహన కల్పించారు. అటు వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు నాణ్యమైన వైర్లు, పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.