PPM: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దటమే ఉల్లాస్ పథకం ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం. సుధారాణి తెలిపారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఉపాధి హామీ ఎపీవోలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 67,111 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలన్నారు. 10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ను నియమించలన్నారు.