ATP: విజయవాడ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి గుంతకల్లు నియోజకవర్గం వైసీపీ యువ నాయకుడు గాది లింగేశ్వర బాబు పాల్గొన్నారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గం రాజకీయ పరిస్థితుల గురించి సజ్జలకు వివరించినట్లు ఆయన తెలిపారు.