SRCL: శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీటితో పాటు, మూలవాగు, మానేరు ద్వారా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రం వరకు 18,060 క్యూసెక్కుల ఇన్ ఫ్లోకొనసాగుతుంది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 14,800, గాయత్రి పంప్ హౌస్ నుంచి 3,150 క్యూసెక్కులు మూల వాగు, మానేరు వాగు ద్వారా 110 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.