W.G: గోదావరికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో రెండు రోజుల నుంచి మళ్లీ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఆచంట మండలం కోడేరు రేవులో గురువారం సాయంత్రం నాటికి 4 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. అలాగే రైతులు కొబ్బరికాయలను పడవలపై తీసుకువచ్చి ట్రాక్టర్ల పైకి ఎగుమతి చేస్తున్నారు.