KRNL: నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసులు, మెగాస్టార్ చిరంజీవి 70వ వసంతాన్ని జరుపుకునే సందర్భాన్ని పురస్కరించుకొని, తన రక్తంతో చిరంజీవి చిత్రాన్ని గీయడం ద్వారా ప్రత్యేకమైన వినూత్నతను ప్రదర్శించారు. 1979లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిరంజీవి, అద్భుతమైన నటనతో కోట్ల హృదయాలను సంపాదించి మెగాస్టార్గా ఎదిగారని తెలిపారు.