JGL: కోరుట్లకు నిధులు మంజూరు చేయాలని మంత్రి శ్రీధర్ బాబును కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా పలకరించారు. కోరుట్ల నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మంత్రిని కోరారు.