Rains : ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులు వర్షాలు.. నైరుతీ రుతుపవనాలు ముందుగానే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడుంది.
Rains in Telangana for four days. Yellow alert issued for those districts
Rains in Andhra Pradesh: ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని వార్త చెప్పింది వాతావరణ శాఖ. నైరుతీ రుతుపవనాలు ఈనెల 19న దక్షిణ అండమాన్లో మొదటగా ప్రవేశించనున్నాయి. ఇక్కడి నుంచి అవి కేరళకు చేరుకోవడానికి దాదాపుగా పది రోజుల సమయం పడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు(RAINS) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్య ప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. ఆ కారణంగా మంగళవారం నుంచి అంతగా వడగాలుల ప్రభావం ఉండకపోవచ్చని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్( ANDHRA PRADESH) రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. వచ్చే నాలుగు రోజుల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. తేలికపాటి వానలు పడే అవకాశాలున్నాయి.
ఇక సోమవారం నంద్యాల, కాకినాడ, అనకాపల్లి, బాపట్ల, సత్యసాయి, శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం.. తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(RAINS) కురిశాయి. ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో అత్యధికంగా 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.