AP: అమరావతి రాజధాని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 6 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. రూ.1.50 లక్షల వరకు దీన్ని వర్తింపజేస్తామని తెలిపారు. తాడికొండ MLA శ్రావణ్ ఇవాళ తన దృష్టికి తీసుకువచ్చిన ఈ అంశంపై CM చంద్రబాబుతో మాట్లాడగా.. ఆయన తక్షణమే రుణమాఫీకి అంగీకరించారని మంత్రి వెల్లడించారు.