AP: ఏలూరు జిల్లా పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల వివరాలను ఆరా తీశారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.