గత ఏడునెలలు నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 30వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చర్చలకు స్వస్తి పలికింది.
Hamas-Isreal: గత ఏడునెలలు నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 30వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చర్చలకు స్వస్తి పలికింది. హమాస్‌పై కాల్పుల విరమణకు ముగింపు పలికితే గాజా కష్టాలు మరింత పెరుగుతాయి. అదే సమయంలో హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్, సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ బలగాల గుంపును లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఇజ్రాయెల్ సైన్యం కమాండ్ ప్రధాని కార్యాలయాన్ని లక్ష్యంగా జరిపిన దాడిలో ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ వద్ద పది రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాడి జరిగిన వెంటనే క్రాసింగ్‌ను మూసివేయాలని ఇజ్రాయెల్ సైన్యం నిర్ణయించుకుంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలకు ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలిపారు. హమాస్ మళ్లీ బయటకు వచ్చి గాజాను తన అధీనంలోకి తీసుకుని, బంకర్లు నిర్మించే పరిస్థితిని అంగీకరించలేమన్నారు. తమ పౌరుల భద్రతను ప్రమాదంలో పడవేయలేమని స్పష్టం చేశారు. వస్తున్న అన్ని విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.