»Israel Thousands Protest Against Netanyahus Government
Israel: నెతన్యాహు ప్రభుత్వానికి వేలాదిమంది వ్యతిరేకంగా నిరసన
హమాస్ చేతుల్లో చిక్కుకుని బందీలుగా ఉన్న వాళ్లను వెంటనే తీసుకురావాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వేలాదిమంది వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
Israel: హమాస్ చేతుల్లో చిక్కుకుని బందీలుగా ఉన్న వాళ్లను వెంటనే తీసుకురావాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వేలాదిమంది వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జెరూసలెంలోని పార్లమెంట్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు మరణించారు. అలాగే దాదాపు 250 మందిని బందీలుగా చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్లు హమాస్ చెరలో బంధీలుగా ఉన్నారు. ఈక్రమంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు.
కొందరు నెతన్యాహు పోరాటానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు యుద్ధానికి వెంటనే ముగింపు పలికి బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బందీల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు తమవారు బయటకు రారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వమే అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారు.