»Benjamin Netanyahu Israel Stalls Ceasefire Talks With Hamas
Benjamin Netanyahu: యుద్ధం ఆపేది లేదు
హమాస్ పెట్టే కండిషన్లకు ఒప్పుకొని యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. శత్రువలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Benjamin Netanyahu Israel stalls ceasefire talks with Hamas
Benjamin Netanyahu: ఇజ్రాయెల్‌పై వస్తున్న ఆరోపణలను ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. హామస్‌తో కాల్పుల విరమణ లేదని స్పష్టం చేశారు. హమాస్ కండిషన్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. ‘‘హమాస్ బయటకు వచ్చి మళ్లీ గాజాలో బంకర్లు నిర్మించి, తమ దేశ పౌరులను చంపే పరిస్థితి రానియమని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. అవసరమైతే తాము ఒంటరిగా పోరు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని, తమను అంతం చేయాలనుకుంటున్న శత్రువులతో పోరాడుతామని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులను ఊచకోత కోసినప్పుడు తమకు ఏ దేశం అండగా లేదని తాము ఒంటరిగానే పోరు చేసినట్లు తెలిపారు. ఈ రోజు కూడా తమ శత్రుదేశాలు తమను నాశనం చేయాలని చూస్తున్నారు.. వారిపై పోరుకు సిద్దంగానే ఉన్నమన్నారు.
హమాస్ ఆకస్మిక దాడితో ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరువైపులు భారీగా ప్రాణ నష్టం జరిగింది. హమీస్ దాడిలో 1,170 మంది మరణించారు. అందులో సామాన్యులే ఎక్కువ. అలాగే ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజాలో 34,683 మంది మరణించారు. అందులో మహిళలు, చిన్నపిల్లలు సైతం ఉన్నారని, ఈ యుద్ధం వలన వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు అని, ఆకలితో చనిపోతున్నారని ఇప్పటికే ఐరాస పలుమార్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరును అమెరికాతో సహా ఇతర దేశాలు ఖండించాయి. యుద్దం ఆపకపోతే అమెరికా నుంచి ఎలాంటి సాయం అందదని ప్రకటించింది. రాఫాపై దాడి చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంజిమిన్ ఎలాంటి ఒత్తిడికి లొంగేది లేదు యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. అదే విధంగా గాజాపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అగ్రదేశాల్లో విద్యార్థులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.