ఇజ్రాయెల్, హమాస్ నడుమ యుద్దం మొదలై దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా, వేలాది ప్రజలు మరణిస్తున్న ఎవరు దిగి రావడం లేదు. ఇలాంటి సమయంలో హమాస్ మద్దతుదారు దేశం అయినా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. త్వరలోనే సర్ప్రైజ్ ఉంటుందని ఆ దేశ సెక్రెటరీ జనరల్ మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చారు.
Hezbollah: ఇజ్రాయెల్, హమాస్ నడుమ యుద్దం ప్రారంభమై ఎనిమిది నెలలు అవుతుంది. గాజాలో వేలాది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే ఈ రెండు ప్రాంతల నడుమ సంధి కుదరలేదు. యుద్దం ముగింపునకు సైతం ఎలాంటి సాంకేతాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా (Hezbollah) గ్రూప్ ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చింది. హమాస్‌కు మద్దతుగా దాడులకు దిగుతున్న ఈ సంస్థ త్వరలో ఇజ్రాయెల్‌కు ‘సర్ప్రైజ్’ ఇవ్వబోతున్నట్లు మీడియా ముఖంగా ఓ సందేశాన్ని ఇచ్చింది.
హోజ్బొల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లాహ్ మీడియా ముఖంగా ఓ వీడియోను విడుదల చేశారు. దానిలో ఇజ్రాయెల్ దేశానికి కచ్చితమైన వార్నింగ్ ఇచ్చారు. దీంతో హమాస్ తరుఫున హెజ్బొల్లా దేశం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగినా యుద్దం తాము ఏమి సాధించలేదని ఇజ్రామెల్ అభిప్రాయపడినట్లు నస్రల్లాహ్ తన సందేశంలో చెప్పుకొచ్చారు. హమాస్ పోరాటం వలనే పాలస్తీనాను ఐరోపా దేశాలు ప్రత్యేక దేశంగా అభివర్ణించారు అని వ్యాఖ్యానించారు. గాజా, రఫాలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను పాటించడం లేదని, అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని నస్రల్లాహ్ ఆరోపించారు.