Hamas war : పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్(Hamas) మిలిటెంట్ గ్రూప్‌ని అంతమొందించే లక్ష్యంతో ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో కీలక పురోగతి సాధించింది. గత వారం జరిపిన దాడుల్లో హమాస్ నంబర్ 3 కమాండ్ మార్వాన్ ఇస్సా హతమయ్యాడు. ఈ విషయాన్నిన అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలివన్ వెల్లడించారు. హమాస్ మిలిటరీ డిప్యూటీ కమాండర్ అయిన ఇస్సా సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో మరణించినట్లు తెలిపారు.
ఇస్సా మరణంతో ఇజ్రాయెల్(Israel) కీలక పురోగతి సాధించినట్లు అయ్యింది. మిలిటెంట్ల ముఖ్యమైన బెటాలియన్లను విచ్ఛిన్నం చేయడమే కాకుండా టాప్ కమాండర్లతో సహా వేల మంది ఫైటర్లను ఇజ్రాయిల్ ఇప్పటి వరకు హతమార్చింది. గత ఐదు నెలలుగా హమాస్‌పై(commander) దాడులు జరుగుతున్నప్పటికీ ఒక టాప్ కమాండర్ మృతి చెందడం ఇదే ప్రధమం.
ఈ విషయమై ఐడీఎఫ్ అధికారి ప్రతినిధి రేర్ అడ్మిరల్ డానియేల్ హగరీ మాట్లాడారు. సెంట్రల్ గాజాలోని భూ గర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సాను లక్ష్యంగా చేసుకుని ఈ నెల 11న ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ దాడుల్లో అతడు చనిపోయాడా? లేదా? అనేది తెలియరాలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంపై అమెరికా వైట్ హౌస్ స్వయంగా ప్రకటన చేసింది.