»Houthi Rebels Houthi Attacks On Ships In The Red Sea First Deaths
Houthi Rebels: ఎర్రసముద్రంలో నౌకలపై హౌతీల దాడి.. మొదటిసారి మరణాలు?
హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో హమాస్‌కు మద్ధతుగా ఎర్ర సముద్రం మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు ఈ నౌకలపై దాడులు చేశారు. కానీ ఈ దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి.
Houthi Rebels: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో హమాస్‌కు మద్ధతుగా ఎర్ర సముద్రం మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు ఈ నౌకలపై దాడులు చేశారు. కానీ ఈ దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి. గ్రీస్ యాజమాన్యానికి చెందిన ట్రూ కాన్ఫిడెన్స్ కార్డో నౌక బార్బడోస్ జెండాతో చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తోంది.
ఆ నౌకపై గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో కార్గో నౌక తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో నౌకలో సుమారుగా 20 మంది సిబ్బంది, ముగ్గురు సాయుధ గార్డులు ఉన్నట్లు సమాచారం. వారిలో భారత్‌కు చెందిన ఒకరు, వియత్నాంకు చెందిన నలుగురు, ఫిలిప్పీన్స్‌కు చెందిన 15 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక యాజమాన్యం తెలిపింది. యెమెన్ నగరం ఎడెన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.