అణుబాంబుల తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తమదేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం కూడా వెనుకాడదని సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ తెలిపారు.
Iran: అణుబాంబుల తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తమదేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం కూడా వెనుకాడదని సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ తెలిపారు. ఇప్పటి వరకు అణుబాంబు తయారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే మాత్రం మా సైనిక విధానం మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ మా అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడిచేస్తే మా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబింగ్ చేయడం చేశారు. దీంతో వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను టెల్‌అవీవ్‌పైకి టెహ్రాన్ ప్రయోగించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం ముదరిన వేళ ఈ ప్రకటన వచ్చింది. ఇరాన్‌ను అణు కార్యక్రమానికి దూరం చేసేందుకు ఐఏఈఏ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ఆ సంస్థ అధిపతి రాఫెల్ గ్రూసీ ఇరాన్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చర్చలకు ఆ దేశం ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపారు. గతేడాది ఇరాన్ బహిర్గతం చేయని ప్రాంతాల్లో యూరేనియం అణువులు దొరికాయి. వాటిపై దర్యాప్తు చేసేందుకు సహకరిస్తానని నాడు ఇరాన్ పేర్కొంది. కానీ, ఆ హామీని నిలబెట్టుకోలేదని గ్రూసీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అవసరమైతే అణుబాంబు చేస్తామన్నట్లు సుప్రీం లీడర్ సలహాదారు చెప్పడంతో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.