Fish rain in Iran : ఇరాన్లో పడిన ఒక వింత సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇరాన్లో అప్పటి వరకు సాధారణంగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. క్షణాల్లోనే వర్షం కురవడం మొదలైంది. ఆ వర్షంలో బతికున్న చేపలు సైతం ఆకాశం నుంచి ప్రారంభమైంది. దీంతో అక్కడి జనం వాటిని ఏరుకునేందుకు పోటీ పడ్డారు.
ఇలా ఒక్కసారిగా ఆకాశంలో చేపల వర్షం కురవడం చూసి ఇరాన్‌లోని(Iran) స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌నూ అల్లాడిస్తున్నాయి. అయితే ఇలా చేపలు వర్షంగా కురిసే ఘటనలు గతంలోనూ అడపా దడపా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తీవ్రమైన గాలితో కూడిన అరుదైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక్కోసారి నీటిలో ఉండే చేపలు సైతం గాలితో పాటుగా మేఘాల్లోకి చేరతాయి. అవి కొద్ది క్షణాల్లోనే ఎక్కడో వానగా పడిపోతాయి. దీన్నే చేపల వర్షం(Fish rain) అని పిలుస్తుంటారు. ఇరాన్ వాతావరణ నిపుణుల నివేదిక సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.
Tras una tormenta en Irán, se registró un extraordinario suceso donde peces vivos caen del cielo. El video viral muestra una escena sorprendente que aún no tiene explicación clara. pic.twitter.com/x4ihwnJP4d