»Abrahamic New Religion A New Religion Formed By The Combination Of Three Religions What Is It
Abrahamic New Religion: మూడు మతాల కలయికతో ఏర్పడిన కొత్త మతం.. ఏదంటే?
ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ప్రస్తుతం 4200కు పైగా మతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త మతం చేరింది. ఆ మతం ఏదో వివరాలు తెలుసుకుందాం.
Abrahamic New Religion: A new religion formed by the combination of three religions.. What is it?
Abrahamic New Religion: ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ప్రస్తుతం 4200కు పైగా మతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త మతం చేరింది. ఈ మతానికి అబ్రహామిక్ అని పేరు పెట్టారు. ఈ మతాన్ని క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ఏర్పాటు చేశారు. యూఏఈ, బహ్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలు 2020లో ఒడంబడిక చేసుకున్నాయి. ఈ మతం అప్పుడే తొలిసారి చర్చకు వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రోత్సాహంతో ఈ ఒడంబడిక గురించి చర్చించుకున్నారు. ఆయన దీన్ని అబ్రహామియన్ ఒప్పందంగా పిలిచారు.
వివిధ మతాల మధ్య ఉన్న పరస్పర భేదాలను తొలగించి, ప్రపంచ శాంతి స్థాపన కోసం ఈ మతాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. అబ్రహామిక్ అనే పేరే ఎందుకు ఈ మతానికి పెట్టారంటే.. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లో అబ్రహంను మొదటి ప్రవక్తగా గుర్తిస్తారు. ఈ మూడు మతాల కలయికతో ఏర్పడటం వల్ల ఆ ప్రవక్త పేరు వచ్చేలా ఈ మతానికి అబ్రహామిక్ అని పెట్టారు.