ప్రధాని మోదీ ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని తెలిపారు. అది మా విధానం కాదన్నారు. నెహు కాలం నుంచే ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు.
PM Modi: ప్రధాని మోదీ ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని తెలిపారు. అది మా విధానం కాదన్నారు. నెహు కాలం నుంచే ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారని మోదీ అన్నారు. ముస్లిం వ్యతిరేకులు అంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు. దాని నుంచి లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి వాళ్లు స్నేహితులని కపట ప్రేమను ప్రదర్శిస్తారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు వాళ్ల ఆందోళనపై నేను నిజాయితీగా ఉన్నా అని ముస్లిం సోదరీమణులు భావించారు. ఆయుస్మాన్ కార్డులు ఇచ్చినప్పుడు, కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చినప్పుడు వాళ్లు అలాగే భావించారు.
నేను ఎవరిమీద వివక్ష చూపించడం లేదు. విపక్షాలు అబద్ధాలు బయటపడ్డాయి. అదే వాళ్ల బాధ. అందుకే తప్పుదోవ పట్టించేందుకు రకరకాల అబద్ధాలు చెప్తూనే ఉంటారని విపక్షాలపై మోదీ మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అయితే ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పున:పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. ఇది రాజకీయంగా కాస్త చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మోదీ స్పందించారు.