Chiranjeevi : చిరంజీవికి మరో అరుదైన గౌరవం.. యూఏఈ గోల్డెన్ వీసా
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ దేశం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. అసలు ఇదేంటి? దీని వల్ల ఉపయోగాలేంటి? తెలుసుకుందాం రండి.
Megastar Gets Golden Visa : మెగాస్టార్(Megastar) చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ తమ దేశం తరఫున ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్న వారికి ఆ దేశం గోల్డెన్ వీసాను అందిస్తుంది. గత వారం తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా ఈ వీసా గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవి(Chiranjeevi) దీన్ని పొందారు. దీంతో చిరు అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
యూఏఈ(UAE) ప్రభుత్వం పలు రంగాల్లో కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసాను(Golden Visa) అందిస్తుంది. వ్యాపారులు, ఇన్వెస్టర్లు, శాస్త్రవేత్తలు, నటులు, కంపెనీ ఫౌండర్లు… ఇలా పలు రంగాల్లో విశేషమైన ప్రతిభ కనబరిచిన వారికి దీన్ని ఇచ్చి గౌరవిస్తుంది. ఈ వీసా ఉన్న వారు యూఏఈలో జీవించేందుకు, చదువుకునేందుకు, పని చేసుకునేందుకు వీలు ఉంటుంది. లోకల్‌గా స్పాన్సర్ ఉండాల్సిన అవసరం ఉండదు. పదేళ్లపాటు ఈ వీసా చెల్లుబాటు అవుతుంది. ఇనీషియల్‌గా ఆరు నెలలపాటు మల్టీ ఎంట్రీ యాక్సస్ సైతం ఉంటుంది.
మన దేశంలో ఉన్న మరి కొందరు ప్రముఖులు సైతం ఇప్పటి వరకు ఈ గోల్డెన్ వీసాను(Golden Visa) అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో చూసుకుంటే షారూక్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, టొవినో థామస్, మమ్ముట్టి, మోహన్ లాల్ తదితరులు ఈ అరుదైన గౌరవాన్ని పొందారు.