Delhi to Varanasi IndiGo flight : ఇటీవల కాలంలో వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లు, బస్‌స్టాప్‌లు, హోటళ్లు… ఇలా అనేక ప్రాంతాలకు బాంబు త్రెట్ కాల్స్ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరాల్సిన ఓ విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇండిగో ఫ్లైట్( IndiGo flight ) 6E2211కి ఈ బెదిరింపులు అందాయి.
చదవండి : ‘పుష్ప 3’ ఉంది.. కానీ అప్పుడే సెట్స్ పైకి?
దీంతో ఇండిగో సంస్థ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ఉదయం ఐదు గంటలకు ఈ విమానం దిల్లీ నుంచి వారణాసి(Delhi to Varanasi)కి బయలుదేరాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఫ్లైట్‌లోకి ఎక్కిన ప్రయాణికులందరినీ యాజమాన్యం తిరిగి దించేసింది. దీంతో విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫ్లైట్‌ని క్షణ్ణంగా తనిఖీలు చేయిస్తున్నారు.
చదవండి : సరికొత్త వెర్షన్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా.. ఇండియాలోనే తొలిసారి!
సోమవారం రాత్రి ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, అక్కడి తాజ్ హోటల్లోని బాంబులు ఉన్నట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు. ఈ కాల్ డాటాను బట్టి ట్రాక్ చేస్తే ఫోన్ ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు( investigation) చేస్తున్నారు.

