Microsoft Outage: 200లకు పైగా విమాన సర్వీసులకు రద్దు చేసిన ఇండిగో.. చెక్ ఇన్ కు లాంగ్ క్యూ
: మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా అనేక విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి. ముంబై, గోవా, ఢిల్లీ, బెర్లిన్, సిడ్నీ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా అనేక విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి. ముంబై, గోవా, ఢిల్లీ, బెర్లిన్, సిడ్నీ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటివరకు మొత్తం 200 విమానాలను రద్దు చేసింది. అలాగే, విమానయాన సంస్థ తన ప్రయాణీకులకు ఒక సలహాను జారీ చేసింది. చాలా ఇండిగో సెంటర్లలో సమస్యలు పెరిగాయని కంపెనీ తెలిపింది. ఈ కారణంగా కంపెనీ 24 గంటల పొడిగింపును కోరింది. ఐటి మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, పాట్నా, గోవా సహా పలు విమానాశ్రయాల్లో మాన్యువల్ చెక్-ఇన్ ప్రారంభమైంది.
ఎయిర్‌లైన్ కంపెనీ ఇండిగో ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది, ‘మైక్రోసాఫ్ట్ తో సమస్య కారణంగా మా సిస్టమ్ ప్రభావితమైంది. దీని కారణంగా విమానాశ్రయాల వద్ద వెయిటింగ్ పిరియడ్ పెరిగింది. స్టో చెక్-ఇన్, లాంగ్ క్యూలను ఎదుర్కోవలసి రావచ్చు. వ్యవస్థను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నాము. సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి మా డిజిటల్ బృందం Microsoft Azureతో నిరంతరం సంప్రదింపులు చేస్తుంది.’ అని పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ అజూర్‌తో కొనసాగుతున్న సమస్యల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా సిస్టమ్‌లు ప్రభావితమవుతున్నాయి. ప్రస్తుతం ఎక్కువ బుకింగులు చేయవద్దని కంపెనీ ప్రయాణికులకు సూచించింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మైక్రోసాష్ట్ తో కలిసి పని చేస్తున్నామని ఇండిగో పేర్కొంది. అలాగే, ఇండిగో సాంకేతిక కారణాల వల్ల కాంటాక్ట్ సెంటర్లో చాలా కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతే కాకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యాన్ని వీలైనంత త్వరగా తొలగించడానికి తమ భాగస్వాములతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది. ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ , స్పైస్‌జెట్‌లు ప్రభావితమయ్యాయి.