»Delhi Airport Terminal Roof Collapsed At The Airport One Dead
Delhi Airport: ఎయిర్పోర్ట్లో కూలిన టెర్మినల్ కప్పు.. ఒకరు మృతి
ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం ఉదయం కుప్పకూలింది. కొన్ని ట్యాక్సీలు, కార్లుపై పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Delhi Airport: Terminal roof collapsed at the airport.. One dead
Delhi Airport: ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం ఉదయం కుప్పకూలింది. కొన్ని ట్యాక్సీలు, కార్లుపై పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కాపాడారు. కానీ ఒక అతను మృతి చెందారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
#UPDATE | 6 people injured after a roof collapsed at Terminal-1 of Delhi airport: Atul Garg, Fire Director https://t.co/r0ikZqMq9N
-1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. టెర్మినల్-1 నుంచి బయలుదేరాల్సిన విమన సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ముందుగానే చెకిన్ కౌంటర్లు కూడా మూసివేశారు. ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. పైకప్పు కూలిన సంఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి.. టెర్మినల్-1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Roof collapse in Delhi Terminal 1 airport departure area. 1 cab driver reported dead in pillar collapsr, at least 5 injuries. Tragedy & national shame. Flights suspended. Full coverage on @IndiaToday. pic.twitter.com/bBSxYbnBMl