»Spicejet Passengers Wait Inside An Aircraft Without Air Ac Amid Severe Heatwave Several Feeling Unwell
Viral Video : విమానంలో పనిచేయని ఏసీ.. నానాఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు కొనసాగుతున్నాయి. మండుతున్న ఎండలు, వేడితో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
Viral Video : దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు కొనసాగుతున్నాయి. మండుతున్న ఎండలు, వేడితో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రుతుపవనాల రాక కోసం ప్రజలు ఎండ వేడికి గురవుతున్నారు. ఈ సమయంలో విమానంలో కూర్చున్న ప్రయాణికులు కూడా వేడితో బాధపడుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఢిల్లీ నుంచి దర్భంగా (ఎస్జీ 486) వెళ్లే స్పైస్జెట్లోని ప్రయాణికులు ఎండ వేడిలో గంటకు పైగా ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) లేకుండా విమానం లోపల వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో చాలా మందికి అస్వస్థత మొదలైంది. విమానం టేకాఫ్ కోసం ప్రయాణికులు ఎదురుచూశారు. ఏసీ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఫ్లైట్లో కూర్చున్న వ్యక్తులు వేడికి ఎలా ఇబ్బందులు పడుతున్నారో వీడియోలో చూడొచ్చు. ప్రయాణీకులతో నిండిన విమానంలో ప్రతి ఒక్కరూ తమ చేతులను ఊపుకోవడం.. చెమట తుడుచుకోవడం కనిపించింది. ప్రయాణికుల ముఖాల్లో ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తోంది.
#WATCH | SpiceJet passengers travelling from Delhi to Darbhanga (SG 476) had to wait inside an aircraft without air conditioning (AC) for over an hour amid the ongoing heatwave, with several feeling unwell. pic.twitter.com/cIj2Uu1SQT
విమానాశ్రయంలో విద్యుత్తు వైఫల్యం
ఎండ వేడికి తోడు కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చాలా సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడున్న ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్టు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరెంటు లేకపోవడంతో చెక్-ఇన్ నుంచి బోర్డింగ్ వరకు అన్ని పనులు నిలిచిపోయాయి. ఇది విమానాలపై కూడా ప్రభావం చూపింది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎండ వేడి విధ్వంసం సృష్టిస్తోంది. సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రిపూట కూడా ప్రజలు దాని వేడిని అనుభవిస్తున్నారు. ఎండ వేడి నుంచి ఏసీలు కూడా ఉపశమనం అందించలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రుతుపవనాల రాక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.