»Air India To Operate Relief Flight From Mumbai To Fly Passengers Stranded In Russia
Air India : రష్యాలో ఎయిర్ ఇండియా ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుల కోసం మరో ఫ్లైట్
ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మార్గ మధ్యంలోనే దాన్ని రష్యాలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Air India: Confusion on board.. Bomb note on tissue paper
Air India : ఎయిర్ ఇండియా విమానాన్ని రష్యాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఈ విమానంలో మార్గ మధ్యంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దీన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్(emergency landing) చేశారు. ఈ విమానంలో మొత్తం 225 మంది ప్రయాణికులు, 19 మంది క్రూ ఉన్నారు. ప్రయాణికుల్ని గమ్య స్థానానికి చేర్చేందుకు మరో ఎయిర్ ఇండియా విమానాన్ని ఇక్కడి నుంచి రష్యాకు పంపిస్తున్నారు. ఈ రిలీఫ్ ఫ్లయిట్‌కు( Relief Flight) రెగ్యులేటరీ క్లియరెన్స్ అనుమతులు సైతం వచ్చాయని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
రష్యాలో దిగడానికి ఆ విమానంలోని ప్రయాణికులతకు(Passengers) వీసాలు లేవు. దీంతో ఈ విషయమై ఎయిర్ ఇండియా మాస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్ అధికారులతో చర్చలు జరుపుతోంది. ప్రయాణికుల్ని హోటళ్లకు పంపేందుకు రష్యా అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో విమాన యాన సంస్థలు అమెరికా వెళ్లేందుకు రష్యా రూట్లను వాడటం లేదు. అయితే ఎయిర్ ఇండియా మాత్రం ఫ్లయింగ్ టైం, కాస్ట్ అడ్వాంటేజ్‌లను దృష్టిలో పెట్టుకుని ఈ రూట్లో విమానాలను నడుపుతోంది. తాజా ఫ్లయిట్ ఫ్లయింగ్ టైంలో సాంకేతిక లోపం నోటీస్అయ్యింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రష్యాలో ఫ్లయిట్‌ని ల్యాండింగ్ చేశారు.