»Delhi Water Crisis Aap Minister Atishi Announcement Strike
Delhi Water Crisis : రెండు రోజుల్లో ఢిల్లీకి నీళ్లు రాకపోతే నిరాహార దీక్ష.. మంత్రి అతిషీ ప్రకటన
ఓ వైపు ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఎండను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నానాటికీ పెరుగుతున్న నీటి ఎద్దడి ఢిల్లీ ప్రజల కష్టాలను మరింత పెంచుతోంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంటుండగా మరోవైపు భూగర్భ నీటి మట్టం పడిపోతోంది.
Delhi Water Crisis : ఓ వైపు ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఎండను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నానాటికీ పెరుగుతున్న నీటి ఎద్దడి ఢిల్లీ ప్రజల కష్టాలను మరింత పెంచుతోంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంటుండగా మరోవైపు భూగర్భ నీటి మట్టం పడిపోతోంది. జూన్ 21లోగా ఢిల్లీకి 100 ఎంజిడి నీరు అందకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఢిల్లీ మంత్రి అతిషి ప్రకటించారు. మంత్రి అతిషి మాట్లాడుతూ.. ఢిల్లీలో 1050 ఎంజీడీల నీటి సరఫరా అవసరం అన్నారు. దీంతో ఢిల్లీలో 100 ఎంజీడీల నీటి కొరత ఏర్పడింది. 1 ఎంజీడీ 28 వేల 500 మందికి నీటి అవసరాలు తీరుస్తుంది. హర్యానా నుంచి 100 ఎంజిడి తక్కువ నీరు వస్తుంటే, 28 లక్షల మందికి తక్కువ నీరు అందుతున్నదని అతిషి చెప్పారు. ఇప్పటికే హర్యానా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.
హిమాచల్ నుంచి నీటిని రానివ్వడం లేదన్నారు. నీటి సమస్యపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. అలాగే జూన్ 18న ఢిల్లీ ప్రభుత్వ అధికారులు హర్యానాకు వెళ్లి ఈ 28 లక్షల మందికి నీళ్లు కావాలని అడిగారని, అయితే హర్యానా ప్రభుత్వం నిరాకరించిందని అన్నారు. ఢిల్లీ, హర్యానా రెండు రాష్ట్రాల్లోనూ మూడు కోట్ల జనాభా ఉందని మంత్రి అతిషి తెలిపారు. హర్యానాకు ఆరు వేల ఎంజీడీల నీరు అందుతుండగా, అందులో ఢిల్లీకి 1050 ఎంజీడీలు మాత్రమే అవసరం.. ప్రస్తుతం అది అందుబాటులో లేదన్నారు.
भीषण गर्मी में जब दिल्लीवालों को ज़्यादा पानी की ज़रूरत है, तब हरियाणा सरकार यमुना में कम पानी छोड़ रही है। कल दिल्ली को हरियाणा से 613 MGD के बजाय 513 MGD पानी ही मिला। इस 100 MGD पानी की कमी से 28 लाख दिल्लीवाले बूँद-बूँद पानी के लिए तरस रहे है।
ఢిల్లీలో నీటి సమస్య పెరుగుతోంది. దీని వల్ల ఢిల్లీలో నీటి సమస్యపై ప్రధానికి లేఖ రాశానని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు నీళ్లివ్వాలని అతీషి కోరారు. జూన్ 21 నాటికి ఢిల్లీ ప్రజలకు 100 ఎంజీడీల నీరు అందకపోతే నిరాహారదీక్ష చేస్తానని అతిషి ప్రకటించారు. మంత్రి అతిషి సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు నిన్న ఢిల్లీకి హర్యానా నుండి 613 ఎంజీడీలకు బదులుగా 513 ఎంజీడీల నీరు మాత్రమే వచ్చింది. ఈ 100 ఎంజీడీ నీటి కొరత కారణంగా, 28 లక్షల మంది ఢిల్లీ వాసులు చుక్క నీటి కోసం తహతహలాడుతున్నారు.