NLG: నాంపల్లి మండలం తుంగపాడుకు చెందిన సాలయ్య శనివారం వడ్డేపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న యువత వెంటనే స్పందించింది. సాలయ్యను పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.84,000 ఆర్థిక సహాయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు. యువత ఐక్యమత్యంతో ఆదర్శంగా నిలవడాన్ని పలువురు అభినందించారు.