HYD: మూసీలోకి వరద ప్రవాహం పెరగడంతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తారు. ఉస్మాన్ సాగర్ 8 గేట్లను 3 అడుగుల ఎత్తి మూసీలోకి 2,704 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. హిమాయత్ సాగర్ 2 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 1,981 క్యూసెక్కుల నీటిని ఈసీ నదికి వదిలారు. దీంతో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.