GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మరింతగా తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 1,11,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తి, 1,11,792 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి ప్రాజెక్టులో 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారి వెంకటేష్ పేర్కొన్నారు.